రేవంత్ ని అరెస్ట్ చేసింది అందుకోసమే.. రజత్ కుమార్

-


కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కొడంగల్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో తెరాస అధినేత కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి నియోజకవర్గ బంద్‌ ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సభలో ఆందోళన చేపట్టేందుకు రేవంత్‌ తన అనుచరులను పోలీసులకు సమాచారం అందడంతో కొడంగల్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బలవంతంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కోస్గిలో మంగళవారం కేసీఆర్‌ సభ ముగిసిన తర్వాత రేవంత్‌‌తో పాటు ఆయన అనుచరులను విడుదల చేస్తామని ఎస్పీ అన్నపూర్ణ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version