బాబుపై రేవంత్ కామెంట్..వైఎస్సార్‌ని ఏం చేయలేకపోయారు.!

-

తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ పాదయాత్రకు సంబంధించి..నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనవరి 26 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బోయినపల్లిలో పి‌సి‌సి నేతలతో సమావేశమై..పాదయాత్ర కార్యాచరణపై చర్చించాఏరు. ఈ సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు.

ఇదిలా ఉంటే ఈ సమావేశంలో చంద్రబాబుపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా సరే..వైఎస్సార్‌ని ఏమి చేయలేకపోయారని అన్నారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాన్ని శాసించలేదని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, అధికారం దిశగా వెళ్దామని రేవంత్..సీనియర్లకు పిలుపునిచ్చారు. అయితే గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ అనుకూల మీడియా..వైఎస్సార్‌కు నెగిటివ్ గా పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చేది..అయినా సరే మళ్ళీ 2009 ఎన్నికల్లో వైఎస్సార్ గెలుపుని ఆపలేకపోయారు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది.

అయితే తన రాజకీయ గురువైన బాబుపై ఈ తరహా కామెంట్ చేయడం వెనుక కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పరోక్షంగా రేవంత్ రెడ్డికి కూడా సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు ఎలాగో కేసీఆర్‌, జగన్‌లకు సైతం అనుకూల మీడియాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్లు సహకరించేలా లేరు.

ఆయన పాదయాత్ర చేస్తే..సెపరేట్ గా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి సీనియర్లు రెడీ అవుతున్నారు. కానీ రేవంత్..పాదయాత్ర విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేరు. తనదైన శైలిలో ముందుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరి చూడాలి రేవంత్ పాదయాత్ర ఏ మేర సక్సెస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version