ఎక్కడున్నా తన మనసు కన్ను ఎప్పుడూ కొడంగల్ ప్రజల మీదే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం కొడంగల్ లో నివాసం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానుల తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కొడంగల్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
పరిశ్రమలు తీసుకువచ్చి యువతకి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కనీసం ప్రచారానికి రాకున్నా మంచి మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు అలానే కష్టాలు ఉన్నప్పుడు అండగా ఉన్నారని భావోద్వేగానికి లోనయ్యారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలని కలవగానే ఈరోజు కొడంగల్ కి వచ్చానని అన్నారు. కొడంగల్ కి వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని ఓటు హక్కు చాలా విలువైందని అన్నారు.