నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్

-

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విచారణ నిమిత్తం ఈడీ కోర్టును మరో ఏడు రోజుల కస్టడీ కోరింది. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్‌పై  వాదోపవాదాలు సాగాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కేజ్రీవాల్ స్టేట్‌మెట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని ఈడీ ఆరోపించింది.


ఆప్‌ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సివుందని, అలాగే పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని, కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని ఈడీ కోరింది. కోర్టులో సొంతంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌ నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 25 వేల పేజీల చార్జిషీట్లలో ఎక్కడ నా పేరు లేదని, అలాగే మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఏడు స్టేట్మెంట్లలో ఆరింటిలో నా పేరు లేదని, 100 కోట్ల అవినీతి జరిగిందని  చెబుతున్నారని.. ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news