టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది : రేవంత్‌ రెడ్డి

-

టీఆర్‌ఎస్‌ నేడు బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. పార్టీలు మార్చే కేసీఆర్ ను ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. ఎమ్మెల్సీకవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈవ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాత్కాలిక ప్రయోజనాల కోసం మాట్లాడుతారని రేవంత్ రెడ్డి అన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లచట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన్నప్పుడు కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తామంతా పోరాటం చేసిన సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని అన్నారు. ముందుగా రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని, ధరణితో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందు ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటబీమా పథకం అమలు చేయడం లేదని, చెరుకు ఫ్యాక్టరీని పున: ప్రారంభిస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సాయం పొందాలంటే రైతు చచ్చిపోవాలా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version