భారతదేశంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారు. టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన స్కిల్ డెవెలప్మెంట్ స్కీం లో అవినీతి జరిగిందని సిఐడి పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి 20 రోజులు కావస్తున్నా బెయిలు రావడం కాదు కదా కనీసం కోర్ట్ లలో చంద్రబాబు కు అనుకూలంగా ఒక్క విషయం కూడా జరగడం లేదు. తాజాగా చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గల్లాలో చర్చనీయాంశం అయింది. ఈయన మాట్లాడుతూ, చంద్రబాబుకు జైలు శిక్ష పాడడం సరైనదే అన్నారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అంటూ కామెంట్ చేయడం విశేషం.
ఈ అవినీతిలో లోకేష్ మరియు అచ్చెన్నాయుడు కు కూడా పాత్రా ఉందని కామెంట్ చేశాడు పాల్. చంద్రబాబు కోసం ఉద్యమాలు చేస్తున్న వారంతా కూడా పైడ్ ఆర్టిస్టు లే అంటూ తేల్చి పారేశారు కె ఏ పాల్.