ఒకప్పటి తెలంగాణా ఉద్యోగ సంఘం నేత, తర్వాతి రోజుల్లో టీఆర్ఎస్ లో చేరి శాశనమండలి చైర్మన్ గా పనిచేసిన స్వామి గౌడ్ ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన కులాల కామెంట్స్ రచ్చ రేపాయి. అయితే ఇప్పుడు ఆయన పక్కన ఉండగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు కీలక కామెంట్స్ చేశారు. బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ లు ఆవిష్కరించారు.
అయితే ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరు ఎంత చెప్పుకున్నా స్వామిగౌడ్,శ్రీనివాస్ గౌడ్ ల పాత్ర ఎవరు కాదనలేరని. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ నాయకత్వంలో పోరాటం చేశామని అన్నారు. సమైక్య పాలనలో స్వామి గౌడ్ మీద దాడి చేసిన అధికారులనే ఈరోజు అందళమెక్కించారని అన్నారు. బడుడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్ కి ఈరోజు గుర్తింపు కరువైందని ఆయన అన్నారు.