కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఇక నుంచి ఆర్‌జీ పాల్‌ అని పిలవండి : రేవంత్‌ రెడ్డి

-

మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడటంపై ఇప్పటికే విమర్శలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తాజాగా రాజగోపాల్‌ రెడ్డిపై మరోసారి ధ్వజమెత్తారు. మునుగోడు అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ శ్రేణుల‌తో గురువారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఉప ఎన్నిక‌ల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. అనంత‌రం రాజ‌గోపాల్ రెడ్డి తీరుపై సెటైర్లు సంధించిన రేవంత్ రెడ్డి… ఇక‌పై రాజ‌గోపాల్ రెడ్డిని ఆర్‌జీ పాల్ అని పిల‌వాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు రేవంత్‌ రెడ్డి. ఇప్ప‌టిదాకా మ‌న‌కు కేఏ పాల్ మాత్ర‌మే ఉన్నార‌ని, ఇక‌పై కేఏ పాల్‌కు మ‌న ఆర్‌జీ పాల్ కూడా తోడ‌య్యార‌ని వ్యాఖ్యానించారు రేవంత్‌ రెడ్డి. రాజ‌కీయాల్లో రాజ‌గోపాల్ రెడ్డి చ‌ర్య‌లు కామెడీని త‌ల‌పిస్తున్నాయ‌న్నారు రేవంత్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version