మునుగోడు గడ్డ మీద రాజగోపాల్‌ రెడ్డిని పాతిపెడదాం : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తరువాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు షాక్‌కు గురయ్యారు. అయితే.. బీజేపీలోకి ఎందుకు వెళ్లావో సూటిగా సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ‘నెల రోజులు జైల్లో ఉన్న నాతో కలిసి పని చేయలేనని చెప్తున్నావు. మరి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌ షాతో ఎలా కలిసి పని చేస్తావు?’ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పార్టీకి ద్రోహం చేసిన వారికి గట్టి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఒక్క ఎమ్మెల్యే పోయినా.. కాంగ్రెస్‌ పార్టీకి పోయేదేమీ లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్‌‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా నుంచి మునుగోడుకు నిధులు తెస్తాడా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి.. రేపు మరోసారి మోసం చేయడా? రాజగోపాల్‌ రెడ్డి లాంటి విశ్వాసఘాతుకుడిని నేనెప్పుడూ చూడలేదంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర హీనుడు, నీచుడు, దుర్మార్గుడు. ఈ మునుగోడు గడ్డ మీద రాజగోపాల్‌ రెడ్డిని పాతిపెడదామంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరంతా కాంగ్రెస్‌ పక్కన నిలబడండని అని రేవంత్‌ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version