చేనేత కార్మికుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోంది : రేవంత్‌ రెడ్డి

-

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి చేనేత కళను చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి. చేనేత కార్మికుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడు తోందని విమర్శిస్తూ ఆదివారం తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు రేవంత్‌ రెడ్డి. నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని ఆ ట్వీట్‌లో పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. కాగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నేతన్నలకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. గాంధీ కూడా రాట్నంపై నూలు వడకడానికి ప్రాధాన్యం ఇచ్చారని, కాంగ్రెస్‌ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ ప్రకటనలో రేవంత్‌ వెల్లడించారు రేవంత్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version