ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్‌ : రేవంత్‌ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌కు వెళ్లారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, వీటిని విడిపించుకునేందుకు కేటీఆర్‌ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కానీ పైకి మాత్రం కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాలంటూ కలరింగ్‌ ఇస్తున్నారన్నారు. ఈ విషయాలను పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ చాలా బాగా మేనేజ్ చేశారన్నారు.

‘‘నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దు. బీజేపీ, బీఆర్ఎస్‌ది తమరు అనుకుంటే తెగిపోయే బంధం కాదు.. ఫెవికాల్ బంధం. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు మీరందరూ కలిసి రండి” అని అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి అని చెప్పారు. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని, దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version