పడుతూ లేస్తున్న రేవంతుడు…లక్ష్యం చేరుతారా?

-

కరెక్ట్ గా ఏడాది క్రితం….తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పు జరిగింది…ఎంతోమంది సీనియర్లు రేసులో ఉన్నా సరే…కీలకమైన టి‌పి‌సి‌సి పదవి రేవంత్ రెడ్డికి దక్కింది. తక్కువ సమయంలోనే ప్రజా మద్ధతు పెంచుకున్న రేవంత్ రెడ్డికి పి‌సి‌సి దక్కడంతో కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. అప్పటివరకు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలైన హస్తం పార్టీ కార్యకర్తల్లో కాస్త జోష్ పెరిగింది.

అయితే టి‌పి‌సి‌సి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలమైన వాతావరణం పెద్దగా రాలేదు…ఈ రేవంత్ రెడ్డి ఏడాది పి‌సి‌సి పయనం ఒక్కసారి చూస్తే..మొదట్లోనే ఆయనకు సీనియర్ల ద్వారా కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. బహిరంగంగానే కొందరు సీనియర్లు రేవంత్ పై విమర్శలు గుప్పించారు. అయితే అన్నిటికి వెనక్కి తగ్గకుండా..తిట్టిన సీనియర్లని సైతం దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అలాగే మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడేలా ప్రణాళికలు రచించారు…బలంగా ఉన్న టీఆర్ఎస్, బలపడుతున్న బీజేపీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. భారీ సభలతో రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా తగ్గలేదని నిరూపించారు..అలాగే రాష్ట్రానికి రాహుల్ గాంధీని రప్పించి…ఎప్పుడూలేని విధంగా భారీ సభని పెట్టి సక్సెస్ అయ్యారు. ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది…మధ్యలో ఉపఎన్నిక ఓటమి వచ్చిన మనోధైర్యం కోల్పోకుండా ముందుకు నడిచారు. పార్టీ లో కొందరు వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తున్నా సరే తడబడకుండా పార్టీని నడుపుతున్నారు.

పార్టీలో ఇప్పటికీ అంతర్గత విభేదాలు ఉన్నా సరే…కాంగ్రెస్ పార్టీ రేవంత్ గ్రిప్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది…అధిష్టానం మద్ధతు రేవంత్ రెడ్డికి ఎక్కువగానే ఉంది. ఇక రేవంత్ ముందున్న లక్ష్యం ఒక్కటే…ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం..ఆ దిశగానే రేవంత్ ఇప్పుడు పనిచేస్తున్నారు…ఇతర పార్టీలకు చెందిన బడా నేతలని పార్టీలో చేర్చుకుంటూ దూసుకెళుతున్నారు. టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ జరుగుతుంటే తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా కాంగ్రెస్ ని నడిపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తన లక్ష్యం చేరుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version