నేను వచ్చాకే తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడింది : రేవంత్‌ రెడ్డి

-

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాతనే పార్టీ ఇమేజ్ పెరిగిందని, రెండు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్‌కి ఊహించని స్థాయిలో ప్రాధాన్యత లభిస్తోందన్నారు రేవంత్‌ రెడ్డి. నేను పీసీసీ చీఫ్ ​తర్వాత రాష్ట్ర నాయకులకు కీలకమైన పదవులు వస్తున్నాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ లో కి చేరుతున్న వ్యక్తుల ద్వారా పార్టీ బలం పెరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2021 వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

తాను పీసీసీ చీఫ్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ నుంచి కీలక నాయకులెవ్వరూ బయటకు వెళ్లలేదని రేవంత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో సిట్టింగ్ లీడర్లు కాంగ్రెస్ ను వదిలి వెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.కానీ ఇప్పుడు సిట్టింగ్ లు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. మరి కొద్ది రోజుల్లో మరింత మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో నిర్వహించామని రేవంత్ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్​హోదాలో అనేక మంది జాతీయ నేతలను వరుసగా తెలంగాణకు తీసుకువస్తున్నానని రేవంత్ చెప్పారు. మరోవైపు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి చర్చలు జరిపారని, ఆ తర్వాత తాను పీసీసీ చీఫ్​ గా ఉన్న సమయంలోనే మళ్లీ కమ్యూనిస్టులు చర్చలు జరుపుతున్నారన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను కూడా అధికారంలోని తెలంగాణలోనే నిర్వహించాలని కాంగ్రెస్ భావించడం సంతోషకరమన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version