రేవంత్ రెడ్డి కాలికి గాయం !

-

ఏలూరు ప్రాజెక్ట్ లో నీటమునిగిన మోటార్ల పరిశీలనకు బయలుదేరిన ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి లను తెలకపల్లి పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశత్వం నడుస్తుందని.. ప్రతిపక్ష పార్టీ జరిగిన ప్రమాదాన్ని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అయితే అక్కడ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే పోలీసులు తమను ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

revanth-reddy

గత రాత్రి మంత్రిని ఎమ్మెల్యేలు ఎలా అనుమతించారు.. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పక్కనే.. పాలమూరు అండర్ టెనల్ నిర్మాణం చేపట్టవద్దని కమిటీ నిర్ణయించినా కూడా.. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడే నిర్మాణాన్ని చేపట్టిందని, నవయుగ కంపెనీ నుంచి కమిషన్లు రావటం లేదని ఆ కంపెనీ ని తీసేసి మెగా కృష్ణా రెడ్డి కి పనులు అప్పగించారని ఆరోపించారు. మీడియాను అనుమతించడం లేదంటే అక్కడ జరుగుతుంది. కల్వకుర్తి వద్ద ఏర్పాటుచేసిన సిస్మో గ్రాఫ్ ను బహిర్గతం చేయాలని అన్నారు. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన కాలికి గాయం అయిందని చెబుతున్నారు. ఈ అంశం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version