సలహాలు సూచనలు ఇవ్వకుండా అనుమానం చెప్పడం అనేది చర్చ పక్కదారి పట్టించడం అని రేవంత్ రెడ్డి అనాన్రు. బడుగు బలహీన వర్గాలు కోసం కట్టుబడి పని చేసేది కాంగ్రెస్ అని అన్నారు. మైనార్టీల స్థితి గతుల పై అధ్యయనం చేసి రేసేర్వేషన్ ఇచ్చాం అని రేవంత్ రెడ్డి అన్నారు. మా అనుభవాల అన్నిటినీ క్రోడీకరించి ఈ తీర్మానం పెట్టాము అన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రకాలుగా వారికి అండగా ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు.
ఆ ఆలోచనకు అనుగుణంగా తీర్మానం అని రేవంత్ రెడ్డి అన్నారు. శాస్రియంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే అన్నారు. సలహాలు తీసుకోవడానిక్ మాకు భేషజాలు లేవు సమగ్ర కుటుంబ సర్వే సభకు ఇచ్చారా మీరు అని అన్నారు. పదేళ్లు అయ్యింది. రహస్య నివేదిక లాగా ఉంచారు అని రేవంత్ రెడ్డి అన్నారు. మీకు అనుమానం ఉంటే.. సూచనలు కూడా ఇవ్వండి అన్నారు.