డీ. శ్రీనివాస్‌ ది లక్కీ హ్యాండ్‌.. అందుకే పార్టీలోకి : రేవంత్‌

-

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్మపూరి శ్రీనివాస్ అతి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 24 వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం అందుతోంది. ఢీల్లీ లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో… ధర్మపూరి శ్రీనివాస్ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

ధర్మపూరి శ్రీనివాస్ ది చాలా లక్కీ హ్యండ్‌ అని.. ఆయన పార్టీ లోకి రావడం చాలా సంతోషకరమని చెప్పారు. ఆయన పీసీసీ గా ఉన్నప్పుడే కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు రేవంత్‌. డీఎస్ వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి చాలా అవసరం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version