మోడీతో ఎంపి సంతోష్ రహస్య మంతనాలు : రేవంత్ మరో బాంబు

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ …మోదీ వేర్వేరు కాదని..బిజెపి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టిఆర్ఎస్ అని ఆరోపణలు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ను ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని.. కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ పాదయాత్ర రద్దు చేసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ప్రారంభం రోజే జోగినిపల్లి సంతోష్ … రాజ్యసభ సభ్యులతో కలసి మోదీని కలిసారన్నారు. ఆ సమావేశంను రహస్యంగా ఎందుకు ఉంచారు ? ఆ తర్వాత జోగినిపల్లి సంతోష్ మోదితో ఏకాంతంగా భేటీ అయ్యారని మరో బాంబు పేల్చారు.

మీ అవినీతి చిట్టా ఉందని మోదీ కాళ్ల మీద పడ్డారా ? మోదీని కలిసినప్పుడు దిగిన ఫోటోలు బయట ఎందుకు బయటపెట్టలేదని నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ఎంపీలు కృష్ణ ,గోదావరి జలాలు,పెండింగ్ నిధులు, కేంద్రం గెజిట్ తో పాటు ఏ అంశాలను ఎందుకు ప్రశ్నించడం లేదు ? సందర్భం వచ్చినప్పుడల్లా బిజెపికి కేసీఆర్ అండగా నిలబడ్డారని మండిపడ్డారు.

మోదికి కేసీఆర్ లొంగిపోయారు… దీనితో తెలంగాణ అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న కేంద్రం గెజిట్ విషయంలో పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపీలు మాట్లాడడం లేదన్నారు. మోదీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం ఇవాళ రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారని.. 14 ప్రతిపక్ష పార్టీలు సమావేశంకు వచ్చాయన్నారు. నీళ్ల విషయంలో కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోంది… ఎపి దాదాగిరి చేస్తుందని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాలలో ఏనాడు టిఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంను నిలదీయలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటే టిఆర్ఎస్ ఎంపీలు కలసి రాలేదని.. రాహుల్ గాంధీ సమావేశంకు టిఆర్ఎస్ రాకుండా మోదికి స్పష్టమైన మద్దతు కేసీఆర్ ప్రకటించారని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version