సీఎం కేసీఆర్, ఢిల్లీ వెళ్లిన టీఆర్ ఎస్ ఎంపీలు, మంత్రులపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యమే ఇవ్వలేదని కేంద్రం చెప్తుందని… చుక్క,ముక్క కోసమే..తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. టీఆర్ ఎస్ ఎంపిలు ప్రజలను మోసం చేశారని.. ఢిల్లీలో కాదు..గల్లీలో తెలుస్తామని వచ్చారన్నారు మండిపడ్డారు. బీజేపీకి చావు డప్పు కొడతామని చెప్పి… కేటీఆర్, కవిత, కెసిఆర్..సంతోష్ లు ఎందుకు పాల్గొనలేదని ఆగ్రహించారు. బీజేపీ తో ఒప్పందం లో భాగంగానే చావు డప్పులో పాల్గొనలేదని.. మండిపడ్డారు.
ఆరు రోజులలో ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డీ తేల్చింది ఏంది..? అని ప్రశ్నించారు.అసలు మీ కార్యాచరణ ఏంది..? పియుష్ గోయల్ ను టీఆర్ ఎస్ కోరింది ఏంటి అని ప్రశ్నించారు. యసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాదు..ఇంకా ఎక్కువ కొనండి అని అడుగుతున్నారని.. అదనంగా ఎంత ధాన్యం ఇస్తారో ..కేంద్రంకు మీరు నివేదిక ఎం ఇచ్చారో చెప్పండని నిలదీశారు. అదనపు ధాన్యం ఎంత ఇస్తారో చెప్పకుండా…. కొంటారా లేదా..? అని మంత్రులు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.