తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. మునుగోడులో గులాబీ పార్టీ జెండా రెపరెపలాడింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. ఇప్పటికే ఉపఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు స్పందించాయి. కేసీఆర్‌కు శుభాకాక్షలు తెలిపాయి. మరోవైపు కొన్ని పార్టీల నాయకులు ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గులాబీ బాస్‌పై విమర్శుల కూడా చేశాయి.
ఈ క్రమంలో ఉపఎన్నిక ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమంటూ ట్వీట్ చేశారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమని అన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతతో పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ట్విటర్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48.9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 10.6 శాతానికి దిగజారింది. మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్ పోటీ చేయగా తొలిసారిగా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 97,239 ఓట్లు రాగా ఈసారి 23,906కు పరిమితమైంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం.
మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
— Revanth Reddy (@revanth_anumula) November 6, 2022