రేవంత్ కు దారేది ? ఉంటారా వెళ్తారా ?

-

నడిసంద్రంలో ఉన్న కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చే బరువు బాధ్యతలను తీసుకున్న రేవంత్ ఆటుపోట్లను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో యాక్టివ్ గా ఉంది అంటే, దానికి రేవంత్ కష్టం ఎంత ఉందో అందరికీ బాగా తెలుసు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్, ఏదోరకంగా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని గట్టు పట్టుదలతోనే ఉంటూ వస్తున్నాడు. సొంత పార్టీ నాయకులు సహకరించకపోయినా సర్దుకుపోతూ , ఒకపక్క సొంత పార్టీ నాయకుల    అసమ్మతిని ఎదుర్కుంటూనే, అధికార పార్టీ టిఆర్ఎస్ పై రాజీ లేకుండా పోరాడుతున్నారు.

కేసులు వేధింపులు అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై హడావుడి చేస్తున్నారు. ఎక్కడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కేసీఆర్, కేటీఆర్ వ్యవహారాలపై ఫోకస్ చేస్తూ, వారి అవినీతి వ్యవహారాలను, ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ వస్తున్నాడు. రేవంత్ కష్టాన్ని చూసి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా, పార్టీలోని తెలంగాణ సీనియర్లు మంత్రం ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఆ పదవిని భర్తీ చేద్దామనుకున్నా వాయిదా వేస్తూనే వస్తోంది.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల వ్యవహారాలతో రేవంత్ సైతం బాగా విసిగి పోయారట. ఈ క్రమంలోనే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు రావడంతో పాటు, కీలక పదవి ఇచ్చేందుకు సైతం ముందుకు వస్తుండడంతో రేవంత్ కాంగ్రెస్ లో ఉంటారా లేక బిజెపిలోకి వెళ్తారా అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా రేవంత్ కనిపిస్తున్నారు. తాజాగా జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన వరద సహాయం పై ప్రభుత్వంపై పోరాటం మొదలు పట్టారు. వరద బాధితులు , కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ కేటీఆర్ ఇద్దర్ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

ఇవన్నీ చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ను విడిచి పెట్టేలా కనిపించడం లేదు. పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉండడంతో ఆయన ఇంత యాక్టివ్ గా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పిసిసి పదవి రేవంత్ కి కాకుండా ఎవరికైనా కట్టబెడితే, ఆయన బిజెపి బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు సిద్ధంగానే వుంటుంది  ఎందుకంటే రేవంత్ సత్తా ఏమిటో కాంగ్రెస్ కంటే బిజెపి , టిఆర్ఎస్ కు బాగా తెలుసు. రేవంత్ సైతం ఇదే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు . ఇప్పటికే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్లు రావడంతో, ఆయన కూడా ఆలోచనలు ఉన్నారంటే కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలను ఎదుర్కొంటూ,  ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని, తన రాజకీయ భవిష్యత్తు కు ఎటువంటి డోకా ఉండకూడదు అంటే, పార్టీ మారడమే బెటర్ అనే అభిప్రాయం లో ఉన్నట్టుగా ను ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా ఈ విషయం బయటకు రాకుండా రేవంత్ జాగ్రత్త పడుతున్నట్టు గా కనిపిస్తున్నారు.

 

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version