బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలయింది. బీహార్ లో ఎన్నికల ముగిసిన నాటి నుండి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా చూస్తే ఆర్జేడీ విజయం సాధించడం ఖాయంగా కనపడుతోంది. ఇక కాసేపటి క్రితం మొదలైన కౌంటింగ్ లో ముందు ఎన్డీఏ కాస్త దూకుడు చూపినా ఇప్పుడు లీడింగ్ లో ఆర్జేడీ దూసుకుపోతుంది.
40 స్థానాల్లో ఎన్డియే ఆధిక్యంలో ఉండగా 72కి పైగా స్థానాల్లో మహా ఘట్ బంధన్ లీడింగ్ లో ఉంది. ఇక బీజేపీ బీ పార్టీగా ఉన్న ఎల్జేపీ ఇంకా ఖాతా తెరవ లేదు. ఇక ఇప్పుడు బీహార్ ఎన్నికలల్లో మహా ఘట్ బంధన్ బాధ్యతలు అన్నీ తన భుజాన వేసుకుని నడిపాడని చెబుతున్నారు. ఇక ఆయన ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా అదో రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వయసు ప్రస్తుతం 31 ఏళ్ళు మాత్రమే. మరి చూడాలి ఈ ట్రెండ్స్ చివరి వరకూ నిలబడి ఆయన ఆధ్వర్యంలోని కూటమి గెలుస్తుందేమో చూడాలి మరి.