రేవంత్ సెన్సేషనల్..పాదయాత్రకు రెడీ.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతుంది..బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా ఉంది. పైగా టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఆ రెండు పార్టీల పోరులో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. పైగా పార్టీలో ఉండే అంతర్గత సమస్యలు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి..కష్టపడుతున్నా సరే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.

ఆయన ఏమో పార్టీని పైకి లేపుతుంటే…కిందకు లాగే వాళ్ళు కొందరు ఉంటారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికలో ఫలితం బట్టి చూస్తే..కాంగ్రెస్ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పట్టున్న స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోయారు. రాహుల్ జోడో యాత్ర జరిగిన సరే…ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్‌పై పెద్దగా పడినట్లు కనిపించలేదు. నిజానికి రాహుల్ యాత్ర విజయవంతంగా సాగింది..కానీ టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల పోరులో పెద్దగా హైలైట్ కాలేదు. పైగా మీడియా కూడా రాహుల్ యాత్రకు పెద్ద కవరేజ్ ఇవ్వలేదు.

దీంతో రాహుల్ జోడో యాత్ర ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలా లేవు. అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి మాత్రం ఉందని అర్ధమవుతుంది. అలాగే కింది స్థాయిలో పార్టీ బలంగానే ఉంది. కాకపోతే టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి రాజకీయ యుద్ధంలో కాంగ్రెస్ కనబడటం లేదు. అందుకే ఇకపై రేవంత్ రెడ్డి కూడా తన రూట్ మార్చుకొనున్నారు. ఇంకా దూకుడుగా రాజకీయం చేయడమే కాదు..టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలకు ధీటుగా ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

అదేవిధంగా రేవంత్ పాదయాత్ర దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే రేవంత్ పాదయాత్రకు సంబంధించి పలుమార్లు కథనాలు వచ్చాయి. కానీ సీనియర్ల వల్ల రేవంత్ ఎక్కడకక్కడ తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్‌తో రేవంత్..ఇంకా సీనియర్లకు చెక్ పెట్టే దిశగా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పార్టీకి ఊపు తీసుకురావడానికి రేవంత్ ఇంకా పాదయాత్ర చేయడం ఖాయమని తెలుస్తోంది. రాహుల్ పాదయాత్ర స్పూర్తితో త్వరలోనే పాదయాత్ర దిశగా అడుగులేస్తున్నట్లు రేవంత్ తాజాగా మీడియా సమావేశంలో చెప్పారు. మరి రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌కు కొత్త కళ వస్తుందేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version