పద్యంతో వైసీపీకి పవన్ కౌంటర్..‘స్క్రిప్ట్’ సజ్జల..!

-

మరి కావాలనే వైసీపీ ప్రభుత్వం కొన్ని వివాదాలని సృష్టిస్తుందో..లేక యథావిధిగానే జరుగుతున్నాయి తెలియదు గాని..కొత్త కంపెనీలు తీసుకు రావడం, కట్టడం లాంటివి చేయడం లేదు గాని ఉన్నవాటికి పేర్లు మార్చడాలు, విగ్రహాలు పెట్టుకోవడం లాంటివి చేస్తుంది. ఇప్పటికే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సి‌ఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీలో..వేమన విగ్రహం తీసి…వైఎస్సార్ విగ్రహం పెట్టారు.

వేమన పేరున్న యూనివర్సిటీలో వేమన విగ్రహం తీయడం విశేషం. ఇంకో విషయం ఏంటంటే..2006లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకొల్పారు. అంతే కాదు.. వేమన గొప్పతనాన్ని చాటేలా యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనిని తొలగించి.. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు.

ఇలా విగ్రహం మార్చడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..వైఎస్సార్ పెట్టిన విగ్రహాన్ని తీయించేశారని, పోనీ ఇంకో చోట వైఎస్సార్ విగ్రహం పెడితే పర్లేదు గాని..ఏకంగా వేమన విగ్రహం తీసేయడం ఏంటి అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇదే క్రమంలో వేమన పద్యంతోనే పవన్ కల్యాణ్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.

“ విద్యలేనివాడు విద్వాంసుచేరువ

నుండగానే పండితుండుగాడు

కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు

విశ్వదాభిరామ! వినుర వేమ!”

“తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.”

ఇలా పవన్…వైసీపీపై ఫైర్ అయ్యారు. ఇలా విగ్రహం మార్చడం కాదని ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..పవన్‌పై ఫైర్ అయ్యారు. విశాఖ ఘటన నేపథ్యంలో పవన్..ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారని అన్నారు. ఇప్పటంలో ఒక్క ఇల్లుని కూడా కూల్చలేదని అన్నారు. చంద్రబాబు, పవన్ ఎందుకు కలుస్తున్నారో తెలియదని, ఒక స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయం చేస్తున్నారని అన్నారు. మొత్తానికి వైసీపీని పవన్ వదలడం లేదు..అటు వైసీపీ కూడా పవన్‌ని టార్గెట్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version