వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ముఖ ద్వారానికి సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు. మరి వాటి కోసం చూద్దాం.
వాస్తు ప్రకారం ఇంట్లో చేపలను పెంచుకుంటే చాలా మంచిదట చాలా మంది ఇళ్లలో చేపలని పెంచుతూ ఉంటారు. నిజానికి చేపలు పెంచడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు దాని నుండి బయటపడడానికి ఇవి బాగా మనకి సహాయం చేస్తాయి.
ఇంట్లో ఆనందం పెరుగుతుంది అలానే ధనం కూడా పెరుగుతుంది ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. అంతేకాక చేపలు ఇంట్లో ఉండడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. గోల్డ్ ఫిష్ అయితే ఇంకా మంచిది. గోల్డ్ ఫిష్ ని ఇంట్లో పెంచడం వలన అదృష్టం వస్తుంది కాబట్టి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఈ చిట్కాని ప్రయత్నం చేయొచ్చు. పండితులు చెప్తున్న ఈ అద్భుతమైన వాస్తు చిట్కాలను కనుక మీరు ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు ఆనందంగా జీవించేందుకు కూడా అవుతుంది.