మంచిరెడ్డి కిషన్ రెడ్డి….తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు…కొన్నేళ్లు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన మంచిరెడ్డి, రెండుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో మంచిరెడ్డి గెలిచారు. ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో టీడీపీ గెలుస్తూ వచ్చింది. కానీ తర్వాత టీడీపీ కనుమరుగైపోయే స్థితికి చేరుకోవడంతో, మంచిరెడ్డి…టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
ఇలా మూడోసారి ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి…అధికార టీఆర్ఎస్‌లో బాగానే పనిచేసుకుంటున్నారు. అటు మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి….మంత్రి కేటీఆర్ ప్రధాన అనుచరుగా ఉన్నారు. అయితే మంచిరెడ్డిపై మల్‌రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చిన మల్‌రెడ్డి…మంచిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. యాచారంలో ఫార్మాసిటీ పేరుతో మంచిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. అలాగే ఒకానొక సందర్భంలో అక్కడ రైతులు, మంచిరెడ్డిపై తిరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా ఇదే అంశంపై రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మంచిరెడ్డి ఫ్యామిలీపై విమర్శలు చేశారు. తండ్రికొడుకులు ఫార్మాసిటీ పేరుతో దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మంచిరెడ్డికి చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి బలపడుతున్నారు. పైగా టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ మంచిరెడ్డికి ఇబ్రహీంపట్నంలో కాస్త గడ్డు పరిస్తితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.