రివ్యూ..18 పేజీస్ మూవీ ఎలా ఉందంటే..?

-

టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ సిద్దార్థ్ కూడా ఒకరు. ఈమధ్య కాలంలో పలు విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యారు. రీసెంట్గా కార్తికేయ -2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్లో 18 పేజీస్ అనే ఒక ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

వరుసహిట్లతో నిర్మిస్తున్న జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని సుకుమార్ రైటింగ్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాకి డైరెక్టర్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకుల నుంచీ భారీ స్పందన లభించింది. దీనికి తోడు ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా గ్రాండ్ గా చేయడంతో మరింత హైప్ పెరిగిపోయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రేమ కథ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.

కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా అన్ని లవ్ స్టోరీస్ లాంటి సినిమా కాదని ఈ చిత్రంలోని సీన్ లు అదిరిపోతూ ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని డైరెక్టర్ల పైన. హీరో పైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ హైలెట్ గా నిలిచిందని ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ సినీ పరిశ్రమలో రాలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది 18 పేజీస్ చిత్రం ఒక గుడ్ స్టోరీ అని తెలియజేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్.. సుకుమార్ రైటింగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news