Big Boss Non Stop: టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్‌దే పై చేయి..కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..

-

‘బిగ్ బాస్’ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో హ్యూమన్స్ టీమ్ పై చేయి సాధించింది. అయితే, ఏలియన్స్ టీమ్ ఓడినప్పటికీ చాలా చక్కగా గేమ్ ఆడారని బీబీ లవర్స్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బిందు మాధవరి, అరియానా, హమీదలను అభినందిస్తున్నారు. వారిని సపోర్ట్ చేస్తున్నారు కూడా. అయితే, కెప్టెన్సీ కంటెండర్స్ లో ఈ వారం కెప్టెన్ ఎవరవుతారనేది ఇంకా ఆసక్తికరంగా మారింది.

హ్యూమన్స్ వర్సస్ ఏలియన్స్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ముఖ్యంగా అషురెడ్డి..బిందు మాధవి మీద చేసిన బోల్డ్ కామెంట్స్ సరి కాదని అంటున్నారు బీబీ లవర్స్. గేమ్ ఓటీటీ వర్షన్ అయినంత మాత్రాన అలా అషురెడ్డి మాట్లాడటం తప్పని చెప్తున్నారు. ‘బిగ్ బాస్’ ఈ విషయమై అషురెడ్డికి సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇక హ్యూమన్స్ టీమ్ లోని కంటెస్టెంట్స్ అఖిల్ తదితరులు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. అయితే, ఈ హ్యూమన్స్ వర్సస్ ఏలియన్స్ టాస్క్ కు సంచాలక్ గా బాబా భాస్కర్ వ్యవహరించిన తీరు పట్ల ఓటింగ్ లో సగం మంది వ్యతిరేకించారు. మరో సగం మంది బాబా మాస్టర్ సంచాలక్ గా పర్ఫెక్ట్ అని చెప్పేశారు. మొత్తంగా బాబా మాస్టర్ ‘బిగ్ బాస్’ షోలో తనదైన శైలిలో దూసుకువెళ్తున్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version