సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు సంవత్సరాలుగా అకారణంగా పోస్టింగ్ లు ఇవ్వకుండా వైటింగ్ లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్ లు ఇచ్చి భర్తీ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఎక్సైజు శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికార్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని.. ఆంధ్ర నుండి తెలంగాణాకు కేటాయించిన తెలంగాణా బిడ్డలైన 3 గురు EXCISE సూపెరింటెండెంట్స్ ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఉద్యోగుల పరువు పోయే విషయం ఏమిటంటే జీత భత్యాలు చెల్లించాల్సిన ప్రభుత్వం ఈ అధికారులకు బ్రతుకు వెళ్లదీయడానికి రెండు మూడు నెలలకు ఒకసారి కన్సాలిడేట్డ్ అప్పు ఏర్పాటు చేసిందని… ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని బ్రతకమంటున్నారని మండిపడ్డారు. ఇట్టి వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక వీరు మరియు కుటుంబ సభ్యులు నానా రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి రావలిసిన PRC increments మరియు premium చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయినవని…వాటిని విడుదల చేయాలన్నారు.

హైదరాబాద్ ఎక్సైజు సూపరింటెండెంట్ కి 3 అదనపు బాధ్యతలు రంగారెడ్డి డీసీ కి 4 అదనపు బాధ్యతలు మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ కు 3 అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంచుమించు శాఖలో ప్రతి ఒక్కరికి అదనపు బాధ్యతలు ఉన్నవి. కానీ పోస్టింగ్ ఇచ్చి పని చేయించుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version