కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ తో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తమ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలా తీసుకు వస్తారు ? అని వారిని నిలదీశారు. తాము దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలని… తన ఇంటి మీద దాడికి పాల్పడిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నించారు.
తన ఇంటి మీద దాడి చేసిన వారిపై ఎందుకు ఎఫ్ ఆర్ ఐ చేయారు ? అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలపై కేసులు బుక్ చేశారు రేవంత్ రెడ్డి. కాగా.. నిన్న మధ్యాహ్నం పూట… తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… ఇంటిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు ముట్టడించారు. ఈ నేపథ్యం లోనే అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా ప్రతి ఘటించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి… వారిని చెదరగొట్టారు.