శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉద్యోగి మిస్సింగ్.. బైక్ దొరికింది కానీ !

-

తెలంగాణాలో గత రెండ్రోజులు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వలన చాలా ఏరియాల్లో వరదలు కూడా ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల మనుషులు కొట్టుకు వెళ్ళిపోయారు కూడా. మొత్తంగా తెలంగాణాలో ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 34కు చేరింది. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేసే శంషాబాద్ కు చెందిన మాధవ్ అనే వ్యక్తి కనిపించడం లేదు. మంగళవారం రాత్రి తన తల్లిని పంజాగుట్టలో బస్సు ఎక్కించిన మాధవ్ మళ్ళీ తాను బైక్ పై శంషాబాద్ బయలుదేరాడని సమాచారం.

ఆ రోజు రాత్రి నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెబుతున్నారు. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో మాధవ్ కనిపించడం లేదని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో మాధవ్ స్నేహితుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ రోజు ఉదయం మాధవ్ బైక్ ను శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద పోలీసులు గుర్తించారు. ఎక్కడిక్కడ వరదలు ఉన్న నేపధ్యంలో మాధవ్ వరదలో గల్లంతయ్యాడా ఇంకా ఎక్కడైనా ఉన్నాడా అనేది తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version