వెరైటీగా మదర్స్ డే విషెస్ చెప్పిన RGV..వర్మకూ సెంటిమెంట్స్ ఉన్నాయంటున్న నెటిజన్లు

-

వివాదాలకు కేరాఫ్ డైరెక్టర్ RGV..అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై తన అభిప్రాయాన్ని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. అలా మీడియాలో హైలైట్ అవుతూ హెడ్ లైన్స్ లో ఉంటూనే ఉంటారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా వర్మ కూడా మదర్స్ డే విషెస్ చెప్పారు.

వర్మ ఏది చేసినా వెరైటీగా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే తన తల్లికి కూడా మదర్స్ డే విషెస్ డిఫరెంట్ గా చెప్పాడు. తన తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన వర్మ..తను మంచి కొడుకును కాదని, కానీ, ఓ తల్లిగా తన మదర్ మంచి తనం కన్న ఎక్కువ అని చెప్తూ..హ్యపీ మదర్స్ డే చెప్పారు.

ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వర్మ మందు తాగే గ్లాస్ తల్లి ముందర పెట్టినట్లున్నాడని, వర్మకూ సెంటిమెంట్స్ ఉంటాయని, ఈ యాంగిల్ అస్సలు ఊహించలేదని’ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా వర్మ మదర్స్ డే రోజు మళ్లీ మీడియాలో హైలైట్ అయిపోయారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version