సుశాంత్ కేసులో కీలక మలుపు…రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు అరెస్టు..!

-

బాలీవుడ్‌ దివంగత యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. అటు బాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా.. ఈ కేసులో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు షోవిక్‌ చ‌క్ర‌వ‌ర్తిని పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. షోవిక్‌తో పాటు సుశాంత్ హౌజ్ మేనేజ‌ర్ శ్యామ్యూల్ మిరాండాను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కోణం బయటపడడంతో వీరిరువురిని ఎన్‌సీబీ(నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డు) అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

విచార‌ణ అనంత‌రం ఇరువురిని అరెస్టు చేశారు. అలాగే వీరితో పాటు డ్రగ్‌ డీలర్లు జైద్‌ విలాత్ర, బిసిత్‌ పరిహార్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. అదేవిధంగా షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరాండాను శనివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version