పైల‌ట్‌గా మారిన ‘టెంప‌ర్’ న‌టి..!

-

ఎన్టీఆర్ హీరోగా పూరీ డైరక్షన్ లో వ‌చ్చిన ‘టెంప‌ర్’ చిత్రంలో న‌టించిన నటి, మోడల్ అపూర్వ శ్రీనివాస‌న్ ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో త‌న‌కిష్ట‌మైన పైల‌ట్ ట్రైనింగ్ లో బిజీ బిజీగా ఉంది. దుండిగ‌ల్ ఎయిర్ బేస్ నుంచి VT-FAV OFLY సెస్స‌నా ఎయిర్ క్రాఫ్ట్‌ లో హైద‌రాబాద్ నగరం మొత్తాన్ని గ‌గ‌న‌తలంపై నుంచి సోలోగా ఒక్కసారి చుట్టేసింది అపూర్వ శ్రీనివాస‌న్. అందుకు సంబంధించి ఎయిర్ బేస్‌లో తీసిన ఫొటోలు, వీడియోను ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

అలాగే పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తయ్యాక ఏదైనా విమానంలో కమర్షియల్ పైలట్‌గా చేరనుంది. అయితే దానికంటే ముందు లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి శిక్షణ పూర్తి చేయనుంది. లైసెన్స్ వస్తే మాత్రం అపూర్వ శ్రీనివాసన్ ఒక చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే.. నటి అయ్యాక పైలట్ అయిన వారు ఇంతవరకు ఎవరు లేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version