సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను నార్కోటిక్స్ డ్రగ్స్ బ్యూరో కూడా విచారిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్లో డ్రగ్స్ వాడే 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పిందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా నార్కోటిక్స్ బ్యూరో స్పందించింది. అసలు రియా చక్రవర్తి ఎవరు పేరు చెప్పలేదు అని స్పష్టం చేసింది.
బ్యూరో డిప్యూటి డైరెక్టర్ కేసీబీ మల్హోత్ర ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రియా చక్రవర్తి సారా అలీ ఖాన్ రకుల్ ప్రీత్ సింగ్ సహా కొంతమంది పేర్లు చెప్పింది అనే ప్రచారం జరిగింది. జాతీయ మీడియా దీనిపై పెద్ద ఎత్తున హడావుడి చేసింది. అసలు ఆమె అలాంటి పేర్లు ఏమీ చెప్పలేదు అని, ఆమెను మేము విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.