అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డిని దుండగులు దారుణంగా హతమార్చారు. భాస్కర్ రెడ్డి మృతదేహం నిన్న తిరుమలగిరి లో కారులో లభ్యం అయ్యింది. నిన్న ఉదయం పది గంటలకు ఇంట్లో వెళ్లినట్టు విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన పది లక్షలు తీసుకెళ్లినట్టు తెలిపారు. అయితే కారులోనే కత్తితో మెడపై పొడిచి దుండగులు హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు.
నిన్న ఉదయం 11 గంటలకు మర్డర్ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ లో మద్యవర్తులే ఆయనను చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహం పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.