ముకేశ్ అంబానీ గంట‌కు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే నోరెల్ల‌బెట్టాల్సిందే..!!

-

ముఖేష్ ధీరూభాయ్ అంబానీ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు. ఇక ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో ఇండియన్ రిచెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. అంటే ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూనే నడుస్తోంది. ఎప్పుడో పూర్వకాలంలో చెప్పినా.. ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. అయితే ప్రపంచంలో ధనవంతులెవరు.. ఎక్కువగా సంపాదించే వారు ఎవరు.. ఇలాంటి వివరాలను కొన్ని సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ సంస్థ ప్రకటించిన అధిక‌ కుబేరుల జాబితాలో ముఖేష్ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం ముఖేష్ ఆస్తుల విలువ అక్షరాలా 67 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైమాటే. రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌తో సమానంగా ముఖేష్ సంపద ఉంటుంది. మరి ముఖేష్‌ ఆదాయం రోజుకు, గంటకు ఎంతో తెలుసా ? అది తెలిస్తే మీరు నోరెల్లబెట్ట‌డం ఖాయం. ప్రతి రోజు ఆయన 168 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే గంటకు ముఖేష్‌ ఆదాయం ఏడు కోట్లన్న మాట. దీన్ని ఇక నిమిషాల్లోకి మార్చుకోండి. ఎంతుంటుందో మీరే తేల్చుకోండి. ఇక అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోన్‌ 140 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో 107 బిలియన్ డాలర్ల ఆదాయంతో LMHV కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. మూడో స్థానాన్ని ప్రపంచమంతా తెలిసిన బిల్‌గేట్స్ 106 బిలియన్ డాలర్ల దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version