ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. మంత్రి నారా లోకేష్ ను.. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది అక్కడి ప్రభుత్వం.

ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ ఫిలిం గ్రీన్ ఈ లేఖను మంత్రి నారా లోకేష్ కు పంపారు. మానవ వనరులు సాంకేతిక అలాగే ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం తో ఆస్ట్రేలియా విద్యారంగా నిపుణులు అలాగే వ్యాపారవేత్తలతో సమావేశమై అభివృద్ధి… ప్రాధాన్యతలపై అలాగే పెట్టుబడులపై ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తో చర్చించే ఛాన్సులు ఉన్నాయి. అందుకే ఆయనకు ప్రత్యేక ఆహ్వానం దక్కింది.