IPL 2021 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

-

ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో రెండో మ్యాచ్ ఈరోజు వాంఖడే స్టేడియంలో జరగనుంది. మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌..రిషబ్‌ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి. అయితే ముందుగా టాస్ వేయగా ఢిల్లీ కెప్టెన్ పంత్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇక ఈరోజు చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌కు ఢిల్లీ జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. సౌతాఫ్రికా పేస్‌ స్టార్లు రబాడా, అన్రిచ్‌ నోర్ట్జే ఆలస్యంగా జట్టులో చేరడంతో వారు క్వారంటైన్‌లోనే ఉండాల్సి ఉంది. వీరు కాక పాటు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కు కూడా ఈ మధ్యలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన కూడా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. 

 

ఇక చెన్నై సూపర్ కింగ్స్  XI అంచనా,

1) ఫాఫ్ డుప్లెసిస్, 2) రాబిన్ ఉతప్ప / రుతురాజ్ గైక్వాడ్, 3) అంబటి రాయుడు, 4) సురేష్ రైనా, 5) సామ్ కుర్రాన్, 6) ఎంఎస్ ధోని (సి / డబ్ల్యు కె), 7) రవీంద్ర జడేజా, 8) మొయిన్ అలీ, 9) శార్దుల్ ఠాకూర్, 10) దీపక్ చాహర్, 11) ఇమ్రాన్ తాహిర్

ఢిల్లీ  XI అంచనా

1) పృథ్వీ షా, 2) శిఖర్ ధావన్, 3) అజింక్య రహానె, 4) షిమ్రాన్ హెట్మియర్, 5) రిషబ్ పంత్ (సి / డబ్ల్యుకె), 6) మార్కస్ స్టోయినిస్, 7) ఆర్ అశ్విన్, 8) అమిత్ మిశ్రా, 9) క్రిస్ వోక్స్, 10) ఇశాంత్ శర్మ, 11) సామ్ బిల్లింగ్స్

Read more RELATED
Recommended to you

Exit mobile version