రితికా సింగ్.. గురు సినిమాతో బాక్సర్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. అందం, అభినయంతో కుర్ర కారును కట్టిపడేస్తోంది. రింగు రింగుల జుట్టుతో ఏదో మాయ చేస్తోంది. అనతి కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రితికా సింగ్ తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటించి దూసుకెళ్తోంది. రితిక సింగ్ నటిగానే కాకుండా 2009లో ఆసియన్ ఇండోర్ గేమ్స్ , సూపర్ ఫైట్ లీగ్ లో క్రీడాకారిణిగా తన సత్తా ఏంటో చూపించింది. ఇక ఆ తర్వాత రితికా సింగ్ 2012లో ఇరుదుచుట్ర అనే తమిళ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక వెంకటేష్ తో కలిసి గురు సినిమాలో నటించి నటనలోనూ ఏం తక్కువ కాదన్నట్లుగా నిరూపించింది. ఈ సినిమాలో రితిక తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో మార్షల్ ఆర్ట్స్ లో అదరగొట్టి ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్ పాత్రలే కాకుండా డి గ్లామర్ పాత్రలు కూడా పోషించి మెప్పించింది. ఇక వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
మరోపక్క సోషల్ మీడియాలో పరువాల విందుతో కుర్ర కారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది . తన హాట్ అందాలను కెమెరాలో బంధించి కుర్రకారు గుండెలను ఆకట్టుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది . ఈ క్రమంలోని తాజాగా రితికా సింగ్ తన గ్రామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లకు సైతం చెమటలు పడుతున్నాయి. ఇందులో పొట్టి నిక్కర్ లో థైస్ అందాలు చూపిస్తూ.. నడుము నాభి అందాలతో పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం రితిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.