పెట్రోల్ పై రూ. 50 తగ్గించాలి… ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్

-

చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ  కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్రోల్ పై రూ.5, డిజిల్ పై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ పెట్రోల్ ధరలను తగ్గించింది. దీంతో దీపావళికి ముందు పండగ కానుకగా కేంద్రం ఈ ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికే యూపీ, ఓడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, మణిపూర్, ఒడిశా వంటి రాష్ట్రాలు పెట్రోల్ రేట్లపై భారీగా పన్నులను తగ్గించాయి. బీహార్ లో పెట్రోల్ పై రూ. 3.2, డిజిల్ పై 3.9 తగ్గించాలని నితీష్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

కాగా కేంద్రం తీసుకున్ని నిర్ణయం పట్ల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెదవి విరిచారు. పెట్రోల్ ధరలు రూ. 50 తగ్గించాలని, కేవలం రూ. 5 తగ్గిస్తే సామాన్యుడికి ఉపయోగం లేదని తెలిపారు. ఇది ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకునే కేంద్రం తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలను కేంద్రం పెంచుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version