పెళ్ళి సంబంధం మాట్లాడుకుని వెళ్తుండగా ప్రమాదం.. 5గురు మృతి.

-

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం తీవ్ర వేదనను మిగిల్చింది. కొత్త ఆశాలతో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నవారికి నిరాశను చూపించింది. పెళ్ళి సంబంధం మాట్లాడుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం, పెళ్ళి సంబంధం కుదుర్చుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దారిలో గేదె అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయిన డ్రైవర్, టిప్పర్ లారీని ఢీకొన్నాడు. తర్లపాడు మండలం రోలుగుంపాడు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో దాదాపు అందరికీ గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఇందులో ఇప్పటి వరకు ఐదుగురు మంది చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version