మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

-

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గుండ్ల పోచంపల్లి శివారులో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు.

accident

ఈ ప్రమాదంలో పేట్ బషీరాబాద్‌‌కు చెందిన కార్తీక్‌ రెడ్డి (23), అనిల్ (23) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పొగమంచు కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news