రైతు బంధు రాలేదని రైతులు అడుక్కుంటున్నారు అంటూ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వివాదస్పద కామెంట్స్ చేశారు. పొద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు భీమా రాలేదు, రుణ మాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటున్నారని ఆగ్రహించారు.
రైతులు ఈ సంవత్సరం కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా అప్పు చేసి మీ కష్టాలు తీర్చిందన్నారు. కోదాడ మండలం, కాపుగల్లులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే.. తుమ్మల వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
రైతే రాజు నినాదం కాదు…కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు. అడగకుండానే రైతుబంధు… అడగకుండానే రైతుబీమా….అడగకుండానే సాగునీళ్లు…అడగకుండానే ఉచితంగా 24 గంటల కరెంటు…అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు చేస్తామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదంటూ తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. రైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరు… సమయం రాక పోదు…మీకు గుణపాఠం చెప్పక పోరు అన్నారు కేటీఆర్.
రైతే రాజు నినాదం కాదు
కేసీఆర్ ప్రభుత్వ విధానంఅడగకుండానే రైతుబంధు
అడగకుండానే రైతుబీమా
అడగకుండానే సాగునీళ్లు
అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు
అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లుదశాబ్దాల కాంగ్రెస్ పాలనతో
వ్యవసాయ రంగం వెన్నువిరిగిబతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో… pic.twitter.com/knPGNRP6YI
— KTR (@KTRBRS) December 7, 2024