వేసవిలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా బీర్పూర్ లోని మోతెనగర్‌లో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘40 ఎకరాల వరకు మా పంటలు ఎండిపోయాయి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు.
సాగు చేయడమే మా దురదృష్టమా? కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదు. రేవంత్ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు.కేసీఆర్ వచ్చాక గల్ఫ్ నుంచి వచ్చి సాగు చేసుకుంటున్నాం . ఇప్పుడు నూకు మళ్ళీ గల్ఫ్‌కి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి’ అని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంటనే సాగుకు నీరందించాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.