ఓఆర్ఆర్ పై కొండ చరియలు విరగిపడ్డాయి. ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి బండరాళ్ల తొలగిస్తున్నారు ఓఆర్ఆర్ అధికారులు. రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు రోడ్డు మీదకి పడ్డాయి. ఈ సాయంత్రం ఓఆర్ఆర్ రాజేంద్రనగర్ ఎగ్జిట్–16 సమీపంలో కొండ చరియలు విరిగి రోడ్డపైన పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే హెచ్ఎండిఏ, హెచ్.జి.సి.ఎల్, ఓఆర్ఆర్ అధికారులు హుటా హుటిన ఆప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి పరిస్థితులను చక్కదిద్దారు.
ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఎత్తైన కొండలు, గుట్టల మధ్య నుంచి రోడ్డు వేసిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లో కూడా ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో రాబోయే మూడు గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పేర్కొనారు. ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిహెచ్ఎంసి కమిషనర్ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.