కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి . పరీక్షల నిర్వహణపై విద్యాబోధన పై కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరికీ శుభవార్త తెలిపింది ప్రభత్వం. ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గిస్తున్నట్లు గా తెలిపింది తెలంగాణ ఇంటర్ బోర్డు.
2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ లో 30 శాతం సిలబస్ తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది అని బోర్డు ముఖ్య కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది అనే విషయాన్ని కూడా తెలిపారు ఆయన. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాని వారిని కూడా పాస్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే సీబీఎస్ఈ ఏ సిలబస్ ఐతే తగ్గించిందో తాము కూడా అదే సిలబస్ తగ్గించేందుకు సిద్ధమయ్యాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.