అందుకే.. బార్బడోస్‌ పిచ్‌పై మట్టిని తిన్నా: రోహిత్ శర్మ

-

టీ20 ప్రపంచకప్‌ 2024లో లీగ్ దశ నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్‌ వరకు అదే జోరు కొనసాగించి విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. బార్బడోస్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్ఇండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఫైనల్ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. అయితే ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు.

‘‘బార్బడోస్‌ పిచ్‌పై మనం ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్ ట్రోఫీ సాధించాం. ఈ పిచ్‌ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని (పిచ్‌) నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్‌ చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ మా కల నెరవేరింది’’ అని రోహిత్ శర్మ అసలు సంగతి చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version