Rohit Sharma : అర్జున్​కు ఆ క్లారిటీ ఉంది.. హిట్​మాన్ ప్రశంసలు

-

IPL 16వ సీజన్​లో ముంబయి ఇండియన్స్ టీమ్ నుంచి ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రోజున సన్​రైజర్స్ హైదరాబాద్ టీమ్​తో జరిగిన మ్యాచ్​లో అర్జున్​ తన తొలి వికెట్ తీశాడు. ఈ మ్యాచ్​లో భువనేశ్వర్‌ కుమార్‌ను పెవిలియన్​ బాట పట్టించి.. తొలి వికెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు రెండు ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ జూనియర్ టెండూల్కర్.. సరైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ముంబయి ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంలో మునిగిపోయాడు. ఈ యువ ఆటగాడిని​ ప్రశంసలతో ముంచెత్తాడు.

“మూడు సంవత్సరాలుగా అర్జున్ ఈ జట్టులో ఓ భాగంగా ఉన్నాడు. అతను చేయాలనుకుంటున్న విషయంపై తనకు పూర్తి క్లారిటీ ఉంది. అతను తన ప్లాన్స్​ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. తన కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ వద్ద యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.” అంటూ రోహిత్​.. అర్జున్​ను కొనియాడాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version