కర్నాటక, తమిళనాడు వాళ్ల ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నాడు – రోజా

-

పవన్ కళ్యాణ్ ది యువ శక్తి కాదు.. ముసలి శక్తి అని మంత్రి రోజా విమర్శలు చేశారు. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో..కర్నాటక ..తమిళనాడు దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అ ఓట్లుపోవడంతో మున్సిపల్ ఎన్నికల కుప్పం ప్రజలు తరిమికొట్టారు..అ ఓట్లతోనే చిత్తూరు ఎంపి సీటు గెలుస్తున్నాడని నిప్పులు చెరిగారు రోజా.

నారా లోకేష్ ది యువగళం కాదు తెలుగు దేశం పార్టీ మంగళం పాడే కాలం…..లోకేష్ వార్డు మెంబర్ ఎక్కువ ..ఎమ్మెల్యే చాలా చాలా తక్కువ అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. తండ్రి సిఎం, తాను మంత్రి గా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయాడు అంటే లోకేష్ కంటే వెస్ట్ లీడర్ ఎవరు లేడన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఎవరికి తెలియడం లేదు…గతంలో చిరంజీవి పార్టీపెట్టి అ కులం వాళ్ళుందరిని రోడ్డుమీద వదిలేశారని మండిపడ్డారు రోజా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version