వైసీపీ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పాపానా ఎవరు పోయారు అందరికీ తెలుసని… చంద్రబాబు చేసినా పాపలకే పోయినా ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చురకలు అంటించారు. అసెంబ్లీ నన్ను ఎన్నిసార్లు కన్నీళ్ళి పెట్టించారు… ఎంత అవమానానికి గురి చేశారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రోజా.
చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఎంత మహిళలు ఎడ్చారో మీకు తెలియదా…అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు దోంగ ఏడుపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని…ఎన్టీఆర్ కూతురుగా మీపై గౌరవం ఉందన్నారు. అనని మాటలు గురించి మాట్లాడి…ఆ గౌరవాన్ని చెడగొట్టుకోకండని వార్నింగ్ ఇచ్చారు రోజా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు.. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు అండగా ఉంటారని రోజా అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. మరోమారు వైసీపీ పార్టీ మాత్రమే.. అధికారంలోకి వస్తుందన్నారు రోజా.